నిర్భయంగా వార్తలు రాస్తే కేసులా.?
1 min read
జర్నలిస్టులపై అక్రమ కేసులు దారుణం
జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలి
నందికొట్కూర్ లో జర్నలిస్టుల ఆగ్రహం..
నందికొట్కూరు న్యూస్ నేడు: గత రెండు రోజుల క్రితం నంద్యాలలో ఐ న్యూస్ ఛానెల్లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు ఆదివారం రాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనందికొట్కూర్ తాలూకా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు సీపీఐ(ఎంఎల్ )న్యూ డెమోక్రసీ లిబరేషన్ పార్టీ నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు పట్టణంలో మంగళవారం ధర్నా చేపట్టారు.పట్టణంలో కేజీ రోడ్డు,పటేల్ సెంటర్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ధర్నా చేపట్టారు.తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను కాలరాసే ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించిన దాఖలాలు లేవని హెచ్చరించారు.నంద్యాల జిల్లాలో మంత్రుల కుమారులు షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్న తీరును ఐ-న్యూస్ లోగోట్టు స్టోరీ ద్వారా బట్టబయలు చేయడంతోనే ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు.అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని లేనిపక్షంలో ప్రజా సంఘాలు, జర్నలిస్టులను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం జర్నలిస్టులు డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు రామాంజనేయులు, నాగేష్,ఐ న్యూస్ నాగరాజు,చంద్రశేఖర్, పరమేష్,ఆంజనేయులు, నరేష్,మల్లికార్జున, జయరాజ్ ,ఇమ్మానియేల్ రాజు,నాగరాజు,ఆయిల్ షఫీ,గౌరీశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


