ఎల్లార్తి దర్గాలో భక్తులకు సేవా కార్యక్రమాలు
1 min read
గంధం ఉరుసు సందర్భంగా రెండు రోజుల పాటు తాగునీరు, ఉచిత ఆరోగ్య శిబిరం
భక్తుల సౌకర్యమే లక్ష్యంగా ఎస్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో సేవలు
హోళగుంద న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామంలోని హజరత్ షేక్షావలి సాహెబ్, హజరత్ షాషావాలి సాహెబ్ దర్గా వద్ద గంధం ఉరుసు సందర్భంగా దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎస్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉరుసుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యంతో పాటు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా భక్తులకు అవసరమైన తాగునీటిని ఉచితంగా అందించడంతో పాటు, ఆరోగ్య సమస్యలు ఎదురైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, వైద్య సలహాలు అందిస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.కె. గిరి మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం హజరత్ షేక్షావలి సాహెబ్, హజరత్ షాషావాలి సాహెబ్ గంధం ఉరుసు సందర్భంగా దర్గాకు వచ్చే భక్తులకు సేవ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల పాటు తాగునీటి సౌకర్యం, ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.దూర ప్రాంతాల నుంచి ఉరుసుకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. మత సామరస్యానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఉరుసు కార్యక్రమంలో భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని యస్.కె. గిరి అన్నారు.ఆరోగ్య శిబిరానికి వచ్చిన భక్తులకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు అందించారు. ఉరుసు సందర్భంగా దర్గాకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.ఈ సేవా కార్యక్రమంలో ఈరన్న, వైద్య సిబ్బంది, డాక్టర్ సునీల్, గంగా, సురేష్ తదితరులు పాల్గొని భక్తులకు సేవలు అందించారు. సేవా కార్యక్రమాలను భక్తులు, స్థానిక ప్రజలు అభినందించారు.



