ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం
1 min read
సత్కరించిన ఎంఈవో మల్లికార్జున నాయక్..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రేమ్ కుమార్, అరుణమ్మ,రాజశేఖర్, ఉమామహేశ్వరి,మిద్దె శ్రీనివాసులు,సైదా సలేహాబీ, హైమావతి,వెంకటేశ్వరమ్మ, శాంతి,షకీరా బేగం, సుమయ్య,దానమయ్య 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం మండల విద్యాశాఖ అధికారి-2 మల్లికార్జున నాయక్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు,జ్ఞాపిక,శాలువ పూలమాలలతో ఎంఈఓ మరియు మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ బిటి శ్రీదేవి,హెచ్ఎం తిమ్మప్ప ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి వారి ఉజ్వల భవిష్యత్తు నిర్మాణానికి అంకితభావంతో పనిచేస్తూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం సంతోషకరమని విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ,నైతిక విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.సేవలను గురించి ఉపాధ్యాయులను గౌరవించడం ద్వారా ఇతర ఉపాధ్యాయులకు మరింత స్ఫూర్తి ప్రోత్సాహం లభిస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో తదితర ఉపాధ్యాయులు ఎంఆర్సీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


