ఉప్పలదడియ’లో పాస్ పుస్తకాల పంపిణీ
1 min read
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట పంచాయతీ ఉప్పలదడియ గ్రామంలో మంగళవారం’మీభూమి-మీ హక్కు’అనే కార్యక్రమం టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి కమతం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మాసపేట ల్,కలమందలపాడు, ఉప్పలదడియ గ్రామాల్లో ఉన్న 525 మంది రైతులకు రాజముద్రత కూడిన నూతన పొలం పాస్ పుస్తకాలు వచ్చాయని వీటన్నిటినీ రైతులకు అందజేస్తామని తహసిల్దార్ టి శ్రీనివాసులు అన్నారు. తెలుగుదేశం పార్టీ రైతు ప్రభుత్వమని పార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని ఎవరి ఫోటోలు లేకుండా రైతుల పొలం పాస్ పుస్తకాలు ప్రభుత్వం ముద్రించడం జరిగిందని మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి అన్నారు.తర్వాత రైతులకు నూతన పొలం పాస్ పుస్తకాలను వారు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోతాలూకా తెలుగు యువత అధ్యక్షులు దేరెడ్డివెంకటేశ్వర రెడ్డి,కమతం వీరారెడ్డి,గోపాల్ రెడ్డి,సిద్ధిక్,వీఆర్వో సంజీవరాజు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.


