NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆయా శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా సాధించాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

కర్నూలు,  న్యూస్​ నేడు:  ఆయా శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సూచనల అమలు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు అంశాలపై  జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు సంబంధించి స్పష్టమైన రోడ్‌మ్యాప్, ప్రత్యేక వ్యూహాలను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలను నిర్ణీత సమయంలో నిర్వహించడంతో పాటు పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు.   జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాటర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమైన చోట్ల కొత్త బోర్ల తవ్వకానికి బదులుగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించడం, చెరువులను నింపడం, డీపెనింగ్, ఫ్లషింగ్ వంటి చర్యలను చేపట్టాలని సూచించారు.   వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పశుసంపదకు అవసరమైన పశుగ్రాసం అందుబాటులో ఉండేలా  కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, సిపిఓ భారతి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *