నిత్యవసర సరుకు లు ధరలను తగ్గించాలి
1 min read
– కలెక్టర్ కార్యా లయం ఎదుట నిరసన – సిపిఐ
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి :నిత్యవసర సరుకు ల ధరలను నియంత్రించాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యం లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు. బుధవారం ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి కే మురళి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం సామాన్యుల పైన ఆర్థిక భారం మోపు తున్నారని,నిత్యవసర సరుకులు రేట్లు ఆకాశాన్ని అంటు తున్నాయని, సామాన్యుల జీవన విధానం అగమ్య గోచరంగా మారింద న్నారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ,ప్రజలకు నిత్యం వంటగదిలో వాడే ఉప్పు, పప్పు, నూనె, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చక్కెర వంటి నిత్యవసర సరుకులు పైన అధికంగా రేట్లు పెంచడం దుర్మార్గమని ఆరోపించారు. బిజెపి అధికారం లోకి వచ్చిన 12 సంవత్సరాల కాలం లో నిత్యవసర సరుకులు,పెట్రోల్,
డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటు తొందన్నారు. గత 12 సంవత్సరాల కాలంలో బిజెపి
కార్పొరేట్ వర్గాలకు కోట్ల రూపాయలు రాయతీలు ఇచ్చి దేశంలో ప్రజలపై భారం మోపిందని విమర్శలు గుప్పించారు. ఇప్పటి కైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తుమలప్ప, ముని రెడ్డి,చలపతి,శ్రీనివాసులు, తరుణ్ నవ్య లు పాల్గొన్నారు.


