NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఖాళీ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను రెండో జాబితాతో భర్తీ చేయాలి

1 min read

ఎస్‌టీయూ డిమాండ్

ప్యాపిలి న్యూస్ నేడు: ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను రెండో జాబితా ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఎస్‌టీయూ ప్యాపిలి మండల శాఖ డిమాండ్ చేసింది. ఇటీవల ప్రభుత్వం ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించిందని, అయితే కొందరు విధుల్లో చేరకపోగా, మరికొందరు చేరిన అనంతరం విధులు విరమించారని ఎస్‌టీయూ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల కో-కన్వీనర్ ఇ. వెంకట్ నాయక్ తెలిపారు.తక్కువ గౌరవ వేతనాల కారణంగానే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు అసంతృప్తికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వారికి రూ.12,500, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే వారికి రూ.10,000 మాత్రమే చెల్లిస్తున్నారని, ఈ వేతనాలను ఆయా పోస్టుల కనీస టైమ్ స్కేల్‌కు సమానంగా పెంచాలని డిమాండ్ చేశారు.ప్యాపిలి గర్ల్స్ జెడ్పీ హైస్కూల్‌లో ఎస్‌టీయూ నాయకులు ఉపాధ్యాయులను కలిసి సభ్యత్వ నమోదు చేపట్టి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలతో పాటు ఐఆర్, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో ఎస్‌టీయూ నాయకులు జి. మద్దిలేటి, బి.వై. మద్దిలేటి, పవిత్రన్ రావు, కె. కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శివ, సుదర్శన్ రెడ్డి, హాజిమస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.

About Author