జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
1 min read
సర్వ విఘ్నాలు తొలగి జిల్లా సమగ్రంగా అభివృద్ధి కావాలి
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఈ నెల 14న సోమవారం వినాయక చవితి పర్వ దినం సందర్భంగా సర్వ విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే మహా గణపతి జిల్లా ప్రజలందరికీ పరి పూర్ణమైన ఆయుఃరారో గ్యాలను, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు జిల్లాపై ఎల్లవేళలా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ప్రజలకు ఒక ప్రకటన లో హృదయ పూర్వకంగా వినాయక చవితి శుభా కాంక్షలు తెలియ జేశారు. ఈ వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైన భక్తి పూర్వకమైన పండుగ. ఆ మహాగణాధిపతి ప్రతి ఒక్కరి విఘ్నాలను తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని అందించాలని జిల్లా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందం గా పండుగ జరుపు కోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.


