NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాసవి క్లబ్ చే ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణి

1 min read

అధ్యక్షులు వివి కృష్ణ రావు

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : మట్టి వినాయక ప్రతిమల ను పూజిద్దాం,  పర్యా వరణాన్ని కాపాడుదామనే నినాదంతో మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీ లో శ్రీ రామాలయం ఎదుట ప్రజలకు, భక్తులకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణి చేయడం జరిగింది. వాసవి క్లబ్ అధ్య క్షులు వివి కృష్ణ రావు, జనరల్ సెక్రటరీ ఈ. వినయ్ కుమార్, కోశాధికారి కె. చంద్ర శేఖర్ గుప్తా మరియు క్లబ్ కార్యవర్గ సభ్యులు కలసి  మట్టి విగ్రహాలు ప్రజలకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వివి కృష్ణారావు మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు. మట్టి విగ్రహాలను ఉప యోగించి, పర్యా వరణ హితమైన వినాయక చవితిని జరుపుకోవాలని ప్రజలకు, భక్తులకు పిలుపునిచ్చారు.మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పైన ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

About Author