NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వంటింటి పనులు మరింత సులభతరం…

1 min read

ఇడ్లీ, దోసె పిండికి 2 లీటర్ల సామర్థ్యం

సూపర్ వెట్‌ గ్రైండర్‌ ప్రారంభ ధర రూ.7,450

టిల్టింగ్‌ మోడల్‌ రూ.9,950

24 నెలల వారంటీ

 హైదరాబాద్‌, న్యూస్​ నేడు : వంటింటి పనులను మరింత సులభతరం చేసేలా కఫ్ రెండు కొత్త వెట్‌ గ్రైండర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సూపర్ వెట్‌ గ్రైండర్‌, సూపర్ టిల్టింగ్‌ వెట్‌ గ్రైండర్‌ పేరుతో 2 లీటర్ల సామర్థ్యంతో వీటిని విడుదల చేసింది. ఇడ్లీ, దోసె వంటి అల్పాహారాలకు అవసరమైన పిండిని మెత్తగా, సమంగా తయారు చేసుకునేలా వీటిని రూపొందించింది.రెండు మోడళ్లలోనూ కాపర్‌ మోటార్లు, మన్నికైన గ్రైండింగ్‌ రాళ్లను ఏర్పాటు చేశారు. సూపర్ వెట్‌ గ్రైండర్‌లో తొలగించుకునే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డ్రమ్‌ ఉండగా.. టిల్టింగ్‌ మోడల్‌లో డ్రమ్‌ను వంచి తొలగించుకునే సదుపాయం ఉంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్టాండ్‌, లాక్‌ వ్యవస్థను అందించారు. కాంపాక్ట్‌ డిజైన్‌తో పాటు థ్రెడ్‌ లాక్‌ సిస్టమ్‌ ఉండటంతో వినియోగం, శుభ్రపరచడం సులభంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. తక్కువ శబ్దంతో పనిచేయడంతో పాటు విద్యుత్‌ ఆదా చేసేలా వీటిని రూపొందించారు. పిండి కలపడానికి అట్టా క్నీడర్‌, కొబ్బరి తురుము కోసం కొబ్బరి స్క్రాపర్‌ను కూడా అందిస్తున్నారు.కఫ్ అప్లయెన్సెస్ సీఈవో నలిన్‌ కుమార్‌ మాట్లాడుతూ..భారతీయ వంటింటిలో కీలకమైన పిండి తయారీని సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త వెట్‌ గ్రైండర్లను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆధునిక వంటగదులకు అనువైన సౌకర్యవంతమైన, నాణ్యమైన ఉపకరణాలను అందించడంలో భాగంగా ఈ ఉత్పత్తులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.సూపర్ వెట్‌ గ్రైండర్‌ ఎంఆర్‌పీ రూ.7,990 కాగా.. ప్రారంభ ఆఫర్‌ ధర రూ.7,450గా ఉంది. సూపర్ టిల్టింగ్‌ వెట్‌ గ్రైండర్‌ ఎంఆర్‌పీ రూ.10,690 కాగా.. ప్రారంభ ఆఫర్‌ ధర రూ.9,950. టర్కాయిస్‌ బ్లూ, పీఓ రెడ్‌ రంగుల్లో లభించే ఈ రెండు మోడళ్లకు 24 నెలల వారంటీ ఉంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *