హమార ప్రసాద్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
1 min read
పట్టణ సీఐ అశోక్ కుమార్ కు వినతిపత్రం అందజేసిన నాయకులు..
నందికొట్కూరు న్యూస్ నేడు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పుస్తకం రాసిన హమారా ప్రసాద్ పై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ కు బహుజన సమాజ్ పార్టీ మరియు పివి.రావు మాల మహానాడు నాయకులు భాస్కర్,స్మశాన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు,బహుజన సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు గద్దల లాజర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కల్పిత నాయకుడు అనే పుస్తకం రాసిన హమారా ప్రసాద్ ను వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అతను రాసిన పుస్తకాలను వెంటనే సీజ్ చేయాలి ఆన్ లైన్ లో పుస్తకాలను సీజ్ చేయాలి. పుస్తకాన్ని సోషల్ మీడియా ద్వారా గాని లేదా డిజిటల్ వేదికల ద్వారా విడుదల కాకుండా సీజ్ చేయాలన్నారు.అంబేద్కర్ హిందూ వ్యతిరేకి,దేశద్రోహి ఏర్పాటు వాది అని విమర్శిస్తూ మతాల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియోలు వాట్సప్ గ్రూపులు ఫేస్ బుక్ గ్రూపులో షేర్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఇతనిపై ఉపా చట్టం క్రింద కేసులు నమోదు చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మరాజు,తిరుపతయ్య,నాగరాజు పాల్గొన్నారు.


