మద్యపాన నిషేధానికి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి
1 min read
అక్టోబర్ 2 జిల్లా సదస్సు, 6న విద్యార్థుల జాతీయ సమావేశం, 7న అమరావతిలో జాతీయ సమావేశం విజయవంతం చేయాలి
హొళగుంద న్యూస్ నేడు: అభినవ అంబేద్కర్, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎస్. కంచప్ప మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ, అనుబంధ సంఘాల ఇన్‌చార్జి దుమ్ము వెంకటేశ్వర్లు చిన్న మాదిగ మాట్లాడుతూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్వహించిన సామాజిక ఉద్యమాలు, సాధించిన విజయాలను వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పీ సీనియర్ నాయకులు మల్లికార్జున, పకీరప్ప, నాగరకనిమి వెంకటేష్, పల్లి ఈరన్న, వెంకటేష్, శేషగిరి, గోవర్ధన్, కంచప్ప, మంగన్న, కలప్ప, ఎంకప్ప, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తప్పేట మల్లికార్జున, పంచగుండిగ వెంకటేష్, నారాయణ, నాగేంద్ర, మల్లయ్య, మృత్యుంజయ రాజు, భీమా, పరశురాం, హనుమంతు, గ్రామ కమిటీ అధ్యక్షులు రంగప్ప, బసవ తదితరులు పాల్గొన్నారు.


