NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ మార్గదర్శి, యుగకర్త”..

1 min read

అడిషనల్ డీఎంఈ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ…

కర్నూలు, న్యూస్​ నేడు : ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శి, యుగకర్తగా కీర్తించబడుతున్న ప్రముఖ కవి, రచయిత, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీలో ఘనంగా నివాళులు అర్పించారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్‌లో గురజాడ అప్పారావు చిత్రపటానికి అడిషనల్ డీఎంఈ & మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గురజాడ అప్పారావు ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శిగా, యుగకర్తగా కీర్తించబడుతున్నారని అన్నారు. తన రచనల ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలు, అన్యాయాలు, సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారని తెలిపారు.గురజాడ రచనలు కేవలం సాహిత్యపరమైన విలువలకే పరిమితం కాకుండా సామాజిక సంస్కరణ, మానవతా విలువలు, సమానత్వం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఉన్నాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ముఖ్యంగా కన్యాశుల్కం వంటి రచనల ద్వారా అప్పటి సమాజంలోని సామాజిక దురాచారాలను ఎత్తిచూపి, మార్పు కోసం తన కలాన్ని ఒక సామాజిక ఆయుధంగా ఉపయోగించారని అన్నారు.“దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్” అనే గురజాడ సందేశం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని అని అన్నారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ లు డాక్టర్ అరుణ, డాక్టర్ రేణుక, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పుష్పలత, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ వైష్ణవి, లెక్చరర్లు బి. సురేష్, భవానీ ప్రసాద్, సరిత, ఎస్.ఆర్. డాక్టర్ ఆండ్రియల్ బ్రయాన్, పీజీ, యూజీ వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author