NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయిభానుకు ఉత్తమ సేవా పురస్కారం

1 min read

సేవే లక్ష్యంగా.. సమాజమే స్ఫూర్తిగా

ఉత్తమ సేవా పురస్కారంతో

సాయిభానుకు మరో అరుదైన గౌరవం

హోళగుంద న్యూస్ నేడు: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సాయిభానుకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత రక్తదాన సేవా మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేసే “బెస్ట్ ఎక్సలెన్స్ సోషల్ సర్వీస్ అవార్డు–2026”ను ఆమె అందుకున్నారు. ఆత్మకూరు–భోనగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో సాయిభానుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ అందించడంతో పాటు మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సాయిభాను సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. అలాగే వృద్ధులు, అనాథలు, ఒంటరిగా జీవిస్తున్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.మారుమూల ప్రాంతం నుంచి తన సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందుతూ ఇప్పటికే పలు పురస్కారాలను అందుకున్న సాయిభాను, “ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవే నిజమైన సేవ” అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలుస్తానని ఆమె తెలిపారు.భారత రక్తదాన సేవా మిషన్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు బాబు, జనరల్ సెక్రటరీ హేమంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాయిభానుకు పురస్కారం లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

About Author