NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీజనల్ వ్యాధులపై అవగాహన – నులిపురుగుల నివారణపై సూచనలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను డాక్టర్ రాజారావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర గౌడు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులైన టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, వైరల్ జ్వరాలపై అవగాహన కల్పించారు.అనంతరం సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా హోమియోపతి మాత్రలను అందజేశారు. ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను నమిలి, చప్పరించి మింగించాలని సూచించారు.పిల్లలు క్రమం తప్పకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని వైద్యాధికారులు సూచించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేష్ నాయక్, అరుణ్ భాయ్, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author