పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి
1 min read
ఏబీఎం కాలనీ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే
నందికొట్కూరు న్యూస్ నేడు: ఏబీఎం కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య కాలనీ ప్రజలతో అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం ఉదయంఏబీఎం కాలనీ ప్రజలతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే వాటి గురించి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి పిల్లలు, మహిళలతో ప్రజలతో మాట్లాడారు.వార్డులో రోడ్లు, డ్రైనేజీ,పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా,వీధి దీపాలు,మౌలిక వసతులపై ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.పలు సమస్యల గురించి వార్డు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ సమస్యలను త్వరితగతిన వెంటనే పరిష్కరించాలని మున్సిపాలిటీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ వార్డులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,ఏఈ దినేష్ కుమార్,సొసైటీ చైర్మన్ ముర్తుజావలి,భాస్కర్ రెడ్డి, కాటేపోగు నాగ సురేష్ కళాకర్,రాజు,రగడ ప్రవీణ్ మరియు అధికారులు పాల్గొన్నారు.


