రూ.122 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం
1 min read
ఏలూరు నగరపాలక సంస్థలో లో రూ 50 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టడం శుభపరిణామం
పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)శంఖుస్థాపన
ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలోని పురపాలక సంఘాలు, ఏలూరు నగరపాలక సంస్థ లో రూ. 122 కోట్లహెచ్‌ఏఎం నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) లతో కలిసి మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో శంఖుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యూటి మోడల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి పట్టణాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు, ప్రజలు తిలకించారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు నగర పాలక సంస్థకు రూ 50 కోట్లు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి రూ 19 కోట్లు, నూజివీడు మున్సిపాలిటీకి రూ 35 కోట్లు, చింతలపూడి మున్సిపాలిటీకి రూ 18 కోట్లతో మొత్తం జిల్లాలో జిల్లాలో రూ 122 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థలో లో రూ 50 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టడం శుభపరిణామమన్నారు. ఈ నిధుల ద్వారా నగరంలో పలు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా.ఎం.జె. అభిషేక్ గౌడ, కమీషనర్ ఏ . భానుప్రతాప్, ఏలూరు ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏపి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ప్రభృతులు పాల్గొన్నారు.


