అక్టోబర్ నాటికి ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి
1 min read
డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి
ప్యాపిలి, న్యూస్ నేడు : అక్టోబర్ నాటికి ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి అందించేలా చర్యలు చేపడుతున్నామని డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి తెలిపారు.మంగళవారం ప్యాపిలి మండల పరిధిలోని నల్లబల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా నల్లబల్లి సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో తాగునీరు, సాగునీరు, రహదారుల సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే కోట్ల సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బత్తుల రామేష్ రెడ్డి, రాజా నారాయణమూర్తి, సీమా సుధాకర్ రెడ్డి, మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, టీడీపీ జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, టీడీపీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మధుకుమార్, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, ఎస్.కె. వలి, మధుసూదన్ గుప్తా, సుధాకర్ గుప్తా, శేషుపణి, జిట్ట కదిరప్ప, వెంకటేష్, పిక్కిలి బోలికొండ, జయరామయ్య తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



