NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు ..అంతర్జాతీయ సంకేతిక భాషల దినోత్సవం “

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా, పి. వాసు,ఆరవ అదనపు జిల్లా జడ్జి, ఫుల్ అడిషనల్ ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు చైర్మన్,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు, బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,  కర్నూలు, వెంకట హరినాధ్, చైర్మన్, శాశ్వత లోక్ అదాలత్ వారు కర్నూలు జిల్లా పరిషత్ నందు నల్సా పిల్లల కోసం పిల్లల స్నేహపూర్వక న్యాయ సేవల పథకం, 2024 పై “న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు మరియు అంతర్జాతీయ సంకేత బాషల దినోత్సవం” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి వాసు మాట్లాడుతూ ప్రపంచ బధిర సమాఖ్య స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు.నల్సా( పిల్లల కోసం పిల్లల స్నేహపూర్వక న్యాయ సేవలు) పథకం, 2024 ద్వారా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి బాల బాలికలకు ఉచిత సురక్షితమైన మరియు సులభమైన న్యాయసహాన్ని అందిస్తుందని తెలిపారు. విద్యాహక్కు,   హెల్ప్ లైన్1098, మహిళా హెల్ప్ లైన్ నంబర్ 181,  న్యాయ సహాయం కోసం హెల్ప్‌లైన్ – 15100, చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, దివ్యాంగజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14456 మొదలు అంశాలను గురించి తెలియజేశారు.మన్సురుద్దీన్ ట్రాఫిక్ సిఐ గారు పిల్లల సైబర్ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోం ఫర్ బాయ్స్ సూపరింటెండెంట్ హుస్సేన్ భాష పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం2015 గురించి వివరించారు. ప్రవీణ్ కుమార్ చైర్మన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు చిన్న పిల్లల సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషిని గురించి వివరించారు.లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్  పనిచేసే ప్రదేశంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ, నిషేధ మరియు పరిష్కార చట్టం 2013 గురించి వివరించారు.అనంతరం ఉత్తమ నృత్య ప్రతిభను కనబరిచిన  విద్యార్థినిలకు లయన్స్ క్లబ్ అఫ్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి రాయపాటి  శ్రీనివాసులు  సహకారంతో బి.లీలా వెంకట శేషాద్రి  బహుమతులను అందించారు.

ఈ కార్యక్రమం లో

 రయిస్ ఫాతిమా అసిస్టెంట్ డైరెక్టర్ డిజేబులిటీ డిపార్ట్మెంట్ ,     లాలేప్ప  ఆర్ ఐ ఓ, ఇంటర్ మీడియట్ కాలేజీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విజయ  మహిళా శిశు సంక్షేమ శాఖ, సుధాకర్ జిల్లా విద్యాశాఖ అధికారి, లోకరాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సర్వ శిక్ష అభియాన్,విజయ్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, వెంకటేశ్వర్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, సాంబశివరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, సురేష్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, తేజ డైరెక్టర్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, రమేష్ నాయక్ ఆర్ యస్ ఐ ఈగల్ టీమ్,శారద, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, మన్సురుద్దీన్ ట్రాఫిక్ సిఐ, రామయ్య నాయుడు సి ఐ మహిళ పోలీస్ స్టేషన్, ప్రవీణ్ కుమార్ చైర్మన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, హుస్సేన్ భాష సూపరింటెండెంట్ గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్, రాయపాటి శ్రీనివాసులు లీగల్ సర్వీసెస్ మెంబర్, శివరామ చంద్ర రావు, చీఫ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, సులోచన, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్, లెక్చరర్లు, స్కూల్ టీచర్లు, న్యాయవాదులు, ప్యారా లీగల్ వాలెంటీర్స్, బధిరులు, బధిర విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *