NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ఇష్టపడి చదవాల్సిందే

1 min read

జేవియర్ నగర్ లోని కళాశాల బిసి విద్యార్థినుల వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

విద్యార్థినులతో రెండు గంటలకు పైగా గడిపి వారి విద్య, జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్

వసతి గృహ విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే కష్టంతో కాక ఇష్టంతో చదవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  స్థానిక జేవియర్ నగర్ లోని నెంబర్ 2 కళాశాల బిసి విద్యార్థినుల వసతి గృహాన్ని మంగళవారం రాత్రి కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా సందర్శించి విద్య, సౌకర్యాలు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో రెండు గంటలకు పైగా మాట్లాడి వారి విద్యా, భవిష్యత్ లక్ష్యాలను, అందుకోసం వారి ప్రణాళికలను ప్రతీ ఒక్కరినీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయన్నారు.  చదువుకోవాలనే అభిలాష,  ఉజ్వల భవిష్యత్తు సాధించాలనే తపన ఉన్నవారు  తాము ఎంచుకున్న కోర్స్ ను ఇష్టంతో అభ్యసించాలన్నారు.   ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాదు దానిని సాదించేందుకు పటిష్టమైన ప్రణాళిక తో అభ్యసిస్తే ఉన్నతస్థాయి ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు.  పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరంకాకూడదన్నది ప్రభుత్వ ఆశయమన్నారు.  ఫీజు రేయింబర్సుమెంట్ తో పాటు విద్యార్థులను అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తున్నదని, ప్రభుత్వం అందించే చేయూతతో తాము కోరుకున్న ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. వసతి గృహంలో గదులు, వాటిలోని సౌకర్యాలు,టాయిలెట్లను పరిశీలించారు. ప్రతీ రోజూ మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నారా అని విద్యార్థినులను కలెక్టర్ ప్రశ్నించారు. వసతి గృహాల్లో రికార్డులను పరిశీలించారు.  సంక్షేమ వసతి గృహాలలో విద్యా ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచేందుకు జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షించమని ఆదేశించడం జరిగిందన్నారు. వసతి గృహంలో ఇంటర్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివే విద్యార్దునులు ఉండడం కలెక్టర్ గమనించి వారి విద్యా ప్రగతిని, భవిష్యత్తు లక్ష్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులనుతోపాటు నేలపైనే కూర్చుని కలెక్టర్ వెట్రిసెల్వి భోజనం చేశారు. అనంతరం వంటకు వినియోగించే సరుకులు, కూరగాయలను, కిచెన్లో పరిశుభ్రతను కలెక్టర్ పరిశీలించారు. అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి,సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి టి. వెంకటేశ్వర్లు,హాస్టల్ వార్డెన్ జాన్సీ లక్ష్మీబాయి, ప్రభృతులు ఉన్నారు. ఈ సందర్భంగా ఫ్రెషర్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు  బహుమతులను,నోట్ పుస్తకాలను  కలెక్టర్ వెట్రిసెల్వి అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *