NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికల వేళ పోలీసుల కవాతు..

1 min read

గ్రూపు గొడవలకు దూరంగా ఉండండి! ఎస్ఐ నాగార్జున

పోతుదొడ్డిలో ఫుట్ పెట్రోలింగ్.. ప్రజలకు పోలీసుల అవగాహన

ప్యాపిలి న్యూస్ నేడు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్యాపిలి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా డోన్ నియోజకవర్గం, ప్యాపిలి మండలంలోని పోతుదొడ్డి గ్రామంలో ఎస్సై నాగార్జున పోలీసు సిబ్బంది ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.అనంతరంఆయన మాట్లాడుతూ  గ్రామ బస్టాండ్ వద్ద ప్రజలతో సమావేశమై ఎన్నికలు ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు.గ్రామంలో గ్రూపులుగా ఏర్పడి పరస్పర విభేదాలను పెంచుకోవడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని, గ్రామంలో శాంతి, సామరస్యాలను కాపాడుకోవాలని సూచించారు.ప్రజలందరూ పోలీసులకు సహకరించి, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *