కూటమి అభ్యర్థుల ను గెలిపిద్దాం…
1 min read
అభివృద్ధికి బాటాల వేద్దాం- ఎమ్మెల్యే షాజహాన్ భాషా పిలుపు
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె పట్టణం పరిధిలోని 17వ వార్డు వడ్డిపల్లి, ఎన్విఆర్ లేఅవుట్, బసినికొండ ప్రాంతా లలో ఎమ్మెల్యే షాజహాన్ భాష స్థానిక కౌన్సిలర్ అభ్యర్థుల తో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధిస్తే మున్సిపాలిటీ సర్వతో ముఖా భివృద్ధి సాధించడం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పన వేగంగా జరుగుతాయన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్క రించాలంటే తెలుగు దేశం, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. స్థా17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సుంచు సంధ్య మాధురి, చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినుబాబు లను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలి పించాలన్నారు. ఇప్పటికే పట్టణంలో వేగంగా రోడ్లు మురుగునీటి కాలువలు మౌలిక సదుపాయాలు తాగునీటి సరఫరా వీధి దీపాలు వంటివి మెరుగు పరచడం జరి గిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, నియోజక వర్గ పరిశీలకులు నెట్టెం వెంకటేష్, ఎస్ ఆర్ షంషీర్, గిరీష్,చిప్పిలి గురునాథ్ యాదవ్, నందకుమార్, చిన్న మహేష్, మేస్త్రి మళ్లీ, రహంతుల్లా పెద్ద ఎత్తున తెలుగు దేశం పార్టీ కార్య కర్తలు వడ్డి పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


