NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థకు అడుగడుగునా అడ్డంకులు

1 min read

ప్రజల ఓటు హక్కును కాలరాసి, ఎన్నికల నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

భయపెట్టి, బెదిరించి, కేసులు పెట్టి సాధించిన విజయాలతో ప్రజలకు ఒరిగేదేమిటి?

రిటర్న్ గిఫ్టుగా రాయచోటికి జిల్లా  కేంద్రాన్ని తీసుకురావాలని డిమాండ్

రాయచోటి అభివృద్ధి బ్రాండ్‌ను నాశనం చేశారు

కూటమి పాలనలో కొత్త పెన్షన్ లేదు..ఇల్లు లేదు.. ఇదేనా సుపరిపాలనా?

కూటమి ప్రభుత్వంపై నిప్పులు చేరిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య జిల్లా నవంబర్ 4 ( సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) : ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులను ఎన్నుకోవాలి.. ప్రజల ఓటే ప్రభుత్వాల భవితవ్యాన్ని నిర్ణయించాలి.. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల తీర్పుకు తావులేకుండా, స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కలెక్షన్.. సెలక్షన్.. నో ఎలక్షన్ అనే కొత్త విధానానికి కూటమి ప్రభుత్వం తెరతీసిందని, ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకునే ప్రాథమిక హక్కును సైతం హరించిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే ఇక సామాన్యుడికి దిక్కెవరని ప్రశ్నించారు. మంగళవారం రాయచోటిలోని వైఎస్ఆర్‌సీపీ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలన, స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రజా సమస్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓటు హక్కుకే ఆటంకాలా?

   మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకుంటానని ముందుగానే సమయం తీసుకున్నప్పటికీ, ఆయన ప్రయాణానికి అనుమతుల విషయంలో చివరి నిమిషంలో ఆటంకాలు సృష్టించడం దారుణమని అన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెలికాప్టర్ దిగడానికి, బయలుదేరడానికి అనుమతులు ఇచ్చినట్లు వ్యవహరించి, తీరా బయలుదేరి వెళ్లే సమయంలో అనుమతులు నిరాకరించి గాలిలోనే నిలిపివేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పులివెందులలో మొత్తం 80 పోలింగ్ కేంద్రాలు ఉంటే 70కి పైగా కేంద్రాల్లో ఏజెంట్లను అనుమతించకుండా తరిమేశారని ఆరోపించారు. కడప, పుత్తూరు, రాయచోటి, పుంగనూరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికల ప్రక్రియ ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుందన్నారు. ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే!

రాష్ట్రంలో మహిళలకు భద్రతేది? సామాన్యులకు రక్షణేది? పేదలకు ఒక్క కొత్త పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యారని, డ్వాక్రా రుణమాఫీతో పాటు అనేక పథకాల ద్వారా మహిళలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళలకు ఆర్థిక భరోసా లేకపోగా, కనీస భద్రత కూడా కరువైందన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పిన హామీని కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *