NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం

1 min read

రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లలో 6 లొకేషన్ లలో  జరగనున్న కౌంటింగ్..

జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : స్థానిక సంస్థల ఎన్నికలు-2026లో భాగంగా జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందన్నారు.. జిల్లా యంత్రంగా ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు.. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం 431 కౌంటింగ్ టేబుల్ లను ఏర్పాటు చేశామని, 515 మంది కౌంటింగ్ సూపర్వైజర్ లను, 1545 మంది కౌంటింగ్ అసిస్టెంట్ లను మొత్తం 2060 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లలో 6 లొకేషన్ లలో   కౌంటింగ్ జరగనుందన్నారు.జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి  కర్నూలు నగరం లోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), బి-క్యాంప్ లో సి.బెళగల్, కల్లూరు, వెల్దుర్తి,  కోడుమూరు, కృష్ణగిరి మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో గూడూరు , కర్నూల్, ఓర్వకల్ మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు..పత్తికొండ   ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దేవనకొండ, మద్దికేర , పత్తికొండ, తుగ్గలి మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుందన్నారు.ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదోని -1,2 , కోసిగి, కౌతాళం, మంత్రాలయం, పెద్దకడబూరు మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు…  ఆలూరు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, హాలహర్వి, హోళగుంద మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు… ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎమ్మిగనూరు లో గోనెగండ్ల నందవరం ఎమ్మిగనూరు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.  కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *