ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి ..ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
1 min read
మదనపల్లె నవంబర్ 6, న్యూస్ నేడు ప్రతినిధి : నేడు జరిగే ఎంపీ టీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలి పారు. మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు.సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎస్పీ బి. ప్రసాద్, ఎన్నికల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు.భద్రత దృష్ట్యా కేంద్రం వద్ద పటిష్ట మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామ న్నారు. అధికారిక పాసులు ఉన్న వారిని మాత్రమే తనిఖీ అనంతరం లోపలికి అనుమ తిస్తారు. కౌంటింగ్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులపై పూర్తి నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.లెక్కింపు ప్రశాంతంగా, పార దర్శకంగా ముగి సేందుకు అందరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.


