NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థి పుట్టినరోజు..పాఠశాలకు స్పీకర్

1 min read

తల్లిదండ్రులను అభినందించిన హెచ్ఎం..

నందికొట్కూరు న్యూస్ నేడు: తమ కూతురు పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు స్పీకర్ అందజేసి తల్లిదండ్రులు మంచి మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న హర్షిత సోమవారం పుట్టినరోజు జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సావిత్రి మరియు ఉపాధ్యాయులకు 30 వేలు విలువచేసే స్పీకర్ ను అందజేశారు.పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగ పడాలనే ఉద్దేశంతోనే స్పీకర్ అందజేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎమ్ మాట్లాడుతూ పిల్లల్లో ఇలాంటి సామాజిక బాధ్యత పాఠశాల పట్ల ప్రేమ ఉండడం చాలా గర్వకారణమని ఈ బహుమతి ప్రార్థనా సమయంలో విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగమని విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో మంచి మనసుతో పాఠశాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ అందజేయడం సంతోషించదగ్గ విషయమని విద్యార్థి హర్షిత ఆమె తల్లితండ్రులు జనార్ధన్, జ్యోతిని అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *