NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల భవిష్యత్తుకు ఉద్యోగ ఆధారిత నైపుణ్య శిక్షణ ఎంతో అవసరం

1 min read

– లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలులోని నైస్ యువజన సాంస్కృతిక మరియు విద్యా సంస్థ ఆధ్వర్యంలో నేడు ఉద్యోగ ఆధారిత నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నైస్ యువజన సాంస్కృతిక మరియు విద్యా సంస్థ అధ్యక్షులు, అంతర్జాతీయ అలయన్స్ క్లబ్స్ జిల్లా 117 గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు మాత్రమే ఉంటే సరిపోదని, వాటితో పాటు ఉద్యోగాలకు అవసరమైన ఆచరణాత్మక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు, సంభాషణా నైపుణ్యాలు, కార్యాలయ నిర్వహణ పద్ధతులు, కంప్యూటర్ పరిజ్ఞానం మరియు వృత్తిపరమైన క్రమశిక్షణను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచలింగాల కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలకు చెందిన సయ్యద్ ఖాసిం బీ, వై. లక్ష్మీదేవి, బి. నీలిమ, ప్రశాంతి, ఎం. హేమలత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన మరియు సమాజ అభ్యున్నతికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *