NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుగవాసి చిన్న రాయుడు కలిసిన చప్పిడి సోదరులు సుండుపల్లె కూటమి ప్రజా ప్రతినిధులు

1 min read

సుండుపల్లె కూటమి నాయకులకు ఆత్మీయ స్వాగతం పలికిన సుగవాసి

గ్రామాల అభివృద్ధి ద్వారా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలి

రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు గాలివీడు జడ్పిటిసి సుగవాసి ప్రసాద్ బాబు

అన్నమయ్య జిల్లా  (సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) : అన్నమయ్య జిల్లాలో ఇటీవల జరిగినజడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలలో గాలివీడు జడ్పిటిసి గా రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించిన సుగవాసి ప్రసాద్ బాబు కి రాజంపేట నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు చప్పిడి సోదరులు చప్పిడి మహేష్ నాయుడు చప్పిడి రమేష్ నాయుడు ల ఆధ్వర్యంలో సుండుపల్లె మండలంలో కూటమి పార్టీల తరఫున ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో విజయం సాధించిన ప్రజా ప్రతినిధులు కూటమి ఐక్యతకు ప్రతీకగా మర్యాదపూర్వకంగా కలిసిపరస్పర అభినందనలు తెలుపుకున్నారు.సోమవారం  గాలివీడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, గాలివీడు జడ్పీటీసీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు ని టి.సుండుపల్లె జనసేన జడ్పీటీసీ బుక్కే మంగే నాయక్ , టి.సుండుపల్లె మండల నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, సీనియర్ టీడీపీ నాయకులు చప్పిడి మహేష్ నాయుడు, చప్పిడి రమేష్ నాయుడు గార్ల ఆధ్వర్యంలో కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.గాలివీడు జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన సుగవాసి ప్రసాద్ బాబు కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ప్రసాద్ బాబు   నూతనంగా ఎన్నికైన కూటమి ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం – జనసేన కూటమి నాయకుల ఈ ఆత్మీయ కలయిక… పరస్పర గౌరవం, అభినందనలు, కూటమి ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సుగవాసి యువసేన అధ్యక్షుడు ఎన్నారై కంచన రెడ్డి శేఖర్ సుండుపల్లె మండలం కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *