నష్టాల్లో సూచీలు
1 min readపల్లె వెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో భారత స్టాక్ సూచీలు నష్టాల బాటపట్టాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మరోసారి కరోన విజృంభించవచ్చన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ రకమైన వ్యతిరేక వార్తలతో అభివృద్ది చెందిన దేశాల ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం 12:20 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 58,141 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 17,332 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్ల నష్టంతో 36చ,446 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది.