రికార్డు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయి లాభాలతో ముగిసాయి. ఉదయం స్వల్ప అనిశ్చితితో ప్రారంభమైన సూచీలు.. అనంతరం లాభాల్లో కదిలాయి. టెలికాం, ఆటో సెక్టార్ కు ప్రభుత్వం నుంచి మద్దతు లభించడంతో.. మార్కెట్లో జోష్ పెరిగింది. సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఇంట్రాడేలో కొత్త గరిష్టాలను చేరుకున్నాయి. సెన్సెక్స్ 476 పాయింట్ల లాభంతో 58,723 స్థాయి వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో 17,519 స్థాయి వద్ద, బ్యాంక్ నిఫ్టీ 239 పాయింట్ల లాభంతో 36,852 స్థాయి వద్ద ముగిసింది.