ట్రూప్ ఆప్ పేరుతో విద్యుత్ చార్జీలు పెంచడంపై.. టీడీపీ నిరసన
1 min readపల్లెవెలుగు వెబ్, ప్యాపిలి: ట్రూప్ ఆప్ పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపిస్తూ.. గురువారం ప్యాపిలి మండలం కలచట్లలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. నాగేశ్వరరావు నేతృత్వంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ప్యాపిలి మండల కన్వీనర్ రామసుబ్బయ్య, ప్యాపిలి తెలుగుదేశం పార్టీ నాయకులు రామ్మోహన్ యాదవ్, మహేష్, వీరా రెడ్డి , కలచట్ల వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ రామాంజనేయులు, రామచంద్రుడు , వెంకట్రాముడు, మాదన్న, నారాయణ , తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్యాపిలి మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు రామ్మూర్తి గారిని పరామర్శించారు.