ప్యాపిలీ ఎంపీడీఓ కార్యాలయంలో.. ఏసీబీ తనిఖీ
1 min readపల్లెవెలుగు వెబ్, ప్యాపిలి: ప్యాపిలి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారులపై చంద్రుడు అనే వ్యక్తి టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేయడంతో తాము తనిఖీ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. బాధితుడు చంద్రుడు తెలిపిన వివరాలి పట్టు పరిశ్రమశాఖకు సంబంధించి షెడ్డుకు 2019లో రూ. 8.5 లక్షలు మంజూరు కాగా… అందులో మూడు లక్షలు జమ అయ్యాయని, మిగిలిన మొత్తం జమ కావాలంటే… 9 శాతం ఇవ్వాలని ఎంపీడీఓ, ఏపీఓ, ఈసీ డిమాండ్ చేశారని పేర్కొన్నాడు. దీంతో ఏసీబీ14400 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేశానన్నారు. తనిఖీ చేసిన వారిలో సీఐలు తేజేశ్వరావు, కృష్ణ రెడ్డి , వంశీ నాథ్, సీతారామిరెడ్డి తదితరులు ఉన్నారు.