ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: నలుగురు చిన్నారులు మృతి
1 min read
పల్లెవెలుగు వెబ్: మధ్యప్రదేశ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ పిల్లల ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో అప్పుడే పుట్టిన పసికందులు నలుగురు మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి విశ్వాస్ సారంగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పిల్లల వార్డు పూర్తిగా పొగతో నిండిపోయిందన్నారు. చిన్నారులను పక్కవార్డులోకి షిప్ట్ చేశామన్నారు. ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. చిన్నారుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపడతామని సీఎం వెల్లడించారు.