పొంగిపోవద్దు… నేలపైనే ఉండండి: ద్రావిడ్
1 min read
పల్లెవెలుగు వెబ్: న్యూజిలాండ్తో జరిగిన టీ-20 సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేయడంపై కోచ్ ద్రావిడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సిరీస్లో అందరూ బాగా ఆడారని అన్నారు. అయితే ఈ విజయంతో పొంగిపోవద్దని.. నేలపైనే ఉండాలని ఆటగాళ్లకు సూచించానన్నారు. టీ-20 సిరీస్లో యువ ఆటగాళ్లు బాగా ఆడారని.. వారికి మరిన్ని అవకాశాలు ఇస్తామని కోచ్ స్పష్టం చేశారు. మరో నాలుగు రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ఉన్నందున్నా ఆటగాళ్లు తొందరగా నిద్రపోవాలని చెప్పినట్లు ద్రావిడ్ తెలిపారు. టెస్ట్ మ్యాచుల సమయంలో ఆటగాళ్లు 7 గంటల కల్లా నిద్ర లేవాల్సి ఉంటుందన్నాడు.