బీహార్ కు ప్రత్యేక హోదా పరిశీలన.. మరి ఏపీకి ?
1 min readపల్లెవెలుగువెబ్ : బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను పరిశీలిస్తున్నామని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. బీహార్ కు అవసరమైన సహాయం చేస్తామని తెలిపారు. గడిచిన దశాబ్ధంలో బీహార్ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. ఇతర రాష్ట్రాలను ఆదుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చన్నారు. బీహార్ కు సాధ్యమైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు, సహకరించేందుకు నీతిఆయోగ్ సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆ రాష్ట్ర వివరణను నిశింతగా పరిశీలిస్తున్నట్టు, తొందరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.