రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు అదే బాటలో కొనసాగాయి. దేశీయంగా ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికాలో కూడ లాక్ డౌన్ ఉండదని అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టం చేశారు. వీటితో పాటు ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. ఐరోపా మార్కట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 611 పాయింట్ల లాభంతో 56,930 వద్ద, నిఫ్టీ 184 పాయింట్ల లాభంతో 16,955 వద్ద ముగిశాయి.