నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు !
1 min read

పల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత వంగవీటి రంగ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో వంగవీటి రాధా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో టీడీపీ నేత వంగవీటి రాధాతో పాటు వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ముగ్గురు నేతలు కలిసి వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. తనను ఏదో చేద్దాం అనుకునే వారిని చూసి భయపడనని, దేనికైనా సిద్ధమేనని అన్నారు. ప్రజల మధ్యే తిరుగుతానని, వంగవీటి రాధాను లేకుండా చేయాలనుకునేవారిని దూరం పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వంగవీటి రాధా ప్రస్తతం టీడీపీలో కొనసాగుతుండగా.. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని, వైసీపీకి మద్దతుగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు విగ్రహావిష్కరణలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. దీంతో పాటు తనను హత్య చేయడానికి కుట్రపన్నారన్న ఆరోపణలు ఎవరిని ఉద్దేశించి చేశారో స్పష్టతలేకపోవడం గమనార్హం.

