సామాజిక సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి : ఎంపీ డా.సంజీవ్ కుమార్
1 min readపల్లెవెలుగు వెబ్: సామాజిక సేవలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్. సోమవారం “స్మైల్ ఇండియా ఫౌండేషన్” ఆవిర్భావం సందర్భంగా కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్ సంస్థ సభ్యులతో కలసి ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేయాలని, సంస్థ త్వరితగతిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు మహేశ్వరి, ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు, ఉపాధ్యక్షుడు అశోక్, కార్యవర్గ సభ్యులు రాజు, శివ, నరేష్, మహేష్, బాబు, సుధీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.