బాలకృష్ణ ఇంటి పై కాదు.. జగన్ ఇంటి పై దాడి చేయండి !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి పై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించడం పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం అభివృద్ధిపై స్థానికులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఇంటిపై కాదు.. సీఎం జగన్మోహన్రెడ్డి ఇంటిపై దాడి చేయాలని హెచ్చరించారు. ఏపీలో భౌతిక దాడులు పెరిగాయన్న డీజీపీ క్రైమ్ రిపోర్టు చూసైనా తెలుసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధి ఇంటిపైనే దాడికి పాల్పడితే ప్రజల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. భయపెట్టి పాలన సాగిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.