బీజేపీ ఎమ్మెల్యే మీద దాడి
1 min readపంజాబ్: పంజాబ్ బీజేపీ ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. బట్టలు చింపి కొట్టారు పంజాబ్ రైతులు. రాష్ట్రం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. అబొర్ అరుణ్ నారంగ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ జరిగిన మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను సమర్థిస్తూ ఆయన మాట్లాడటంతో ఆగ్రహించిన రైతులు ఆయన మీద దాడి చేశారని జాతీయ మీడియ కథనం. ఈ ఘటన నిన్న జరిగింది. బట్టలు చింపి కొట్టినట్టు సమాచారం. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు తమపోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు.