సినిమాలు, వీడియోలు చూసి బ్యాంకు దొంగతనం !
1 min readపల్లెవెలుగువెబ్ : సినిమాలు, వీడియోలు చూసి బ్యాంకు దొంగతనం చేశాడో యువకుడు. గత వారం ధీరజ్ అనే యువకుడు బెంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 85 లక్షల నగదు, ఆభరణాలు సంచిలో నింపుకుని పరారీ అయ్యాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి… పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. లోన్ యాప్ లలో రూ. 35 లక్షల రుణం తీసుకున్నాడు. ఆన్ లైన్ ట్రేడింగ్ చేశాడు. మరో ఐదు లక్షలు విలాసాలకు ఖర్చ చేశాడు. అప్పుల భారం పెరగడంతో బ్యాంకు దొంగతనం ఎలా చేయాలో వీడియోలు చూసి నేర్చుకున్నాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.