సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ మనోభావాలు కించపరిచారని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమువీర్రాజు వ్యాఖ్యలను వెంటనే వెనెక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్లు, రాజకీయా నాయకులు తమను కించపరచోద్దని సూచించారు. వీర్రాజు వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ, కడప జిల్లా మీద సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసేలా సోమువీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని ఆక్షేపించారు.