చంద్రశేఖర్ రెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం
1 min readపల్లెవెలుగువెబ్, కర్నూలు హాస్పిటల్: విధి నిర్వహణలో.. అంకితభావం, మరెందరికో.. స్ఫూర్తిదాయకంగా నిలిచిన కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి డెర్మటాలజి విభాగాధిపతి, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. ఐ. చంద్రశేఖర్ రెడ్డి సేవలు… ఆదర్శమని కార్డియాలజి విభాగాధిపతి డా. పి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం పదవి విరమణ పొందిన డెర్మటాలజి విభాగాధిపతి డా. ఐ. చంద్రశేఖర్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని కార్డియాలజి విభాగానికి సంబంధించిన హాల్లో జరిగిన ఆత్మీయ వీడ్కోలు సభలో కార్డియాలజి విభాగాధిపతి డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి, వైద్యకళాశాలకు డెర్మటాలజి ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వైద్యవిద్యార్థులు, జూనియర్ వైద్యులు, సిబ్బంది డెర్మటాలజి ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్డియాలజి విభాగం వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.