సొంతూరిలో కన్నీరు పెట్టిన సీఎం !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సొంతూరు హావేరి జిల్లా శిగ్గావిలో భావోద్వేగానికి లోనయ్యారు. దేశ రక్షణకు కుమారుడిని పంపినట్టు నియోజకవర్గ ప్రజలు తనను పంపారన్నారు. సెలవు దొరికినప్పుడు సైనికుడు స్వగ్రామానికి వచ్చినట్టు తాను మీ చెంతకు వస్తుంటానన్నారు. బెంగళూరులో బయల్దేరే ముందు మీడియా ఎందుకు సార్ మీ ఊరు వెళ్తున్నారు అని అడిగారని, అక్కడికి వెడితే దొరికే సంతోషమే వేరని చెప్పానన్నారు. ఎక్కడా చెడ్డపేరు తీసుకురాకుండా పాలన సాగిస్తున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో కంటతడిపెట్టినట్టుగా మాట్లాడారు.