అసెంబ్లీ.. వైసీపీ నేతలు నన్ను తిడుతున్నారు !
1 min read

పల్లెవెలుగువెబ్ : అసెంబ్లీలో, మండలిలో తననే తిడుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ వాపోయారు. అసెంబ్లీలో తన తల్లిని దూషించారని, తనను తిడుతున్నారని తెలిపారు. తనను, తన తల్లిని దూషించినప్పుడు సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం నవ్వుకున్నారని దుయ్యబట్టారు. సభలో లేని సభ్యుల గురించి మాట్లాడకూడదన్నారు. అయినా ప్రజల కోసం తిట్లన్నింటినీ భరిస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లు తనను చూసి భయపడుతున్నారని నారా లోకేష్ ఎద్దేవాచేశారు.

