సానుకూల సంకేతాలతో లాభాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో రష్యా కొంత మేర సైన్యాన్ని వెనక్కి రప్పిస్తున్నట్టు ప్రకటన చేసింది. దీంతో సూచీలు లాభాల్లోకి ఎగబాకాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు కూడ కొంతమేర తగ్గడం సూచీల లాభాలకు కారణమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు జరుగుతుండగా… మెటల్ రంగం అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది. సెన్సెక్స్ 600 పాయింట్ల లాభంతో 58500 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 17477 వద్ద ట్రేడ్ అవుతోంది.