మంత్రి కట్టుకథ సినిమా తీయండి.. ఆర్జీవిని కోరిన నిందితులు !
1 min readపల్లెవెలుగువెబ్ : తనపై హత్యకు కుట్ర పన్నారంటూ కట్టుకథ అల్లిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైబరాబాద్ పోలీసులతో అరెస్టు చేయించి తమను అక్రమంగా జైలుకు పంపించారని నిందితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పథకంపై ఓ థ్రిల్లర్ సినిమా తీయాలని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర కేసులో అరెస్టు అయి న నిందితులకు మేడ్చల్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిందితు లు శుక్రవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు నిందితులు రాఘవేంద్ర రాజు, మధుసూధన్ రాజు, అమరేందర్ రాజు, రవి, నాగరాజు, విశ్వనాథ్, యాదయ్యలు విలేకరులతో మాట్లాడారు.