అలాంటి తంబ్ నైల్స్ పెట్టొద్దు.. మంచి ఇళ్లకు కోడళ్లుగా వెళ్లాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : యూట్యూబ్ తదితర సోషల్ మీడియాలో తంబ్ నైల్స్ పై నటి జీవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర తంబ్ నైల్స్ ఉపయోగించవద్దని జీవితా రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ‘‘మా పిల్లలకు సినిమాల్లో నటించడం ఇష్టం. వస్తున్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. కానీ మీడియాలో ఇబ్బందికర తంబ్‌నైల్స్ పెట్టడం ఇబ్బందిగా ఉంది. మా బిడ్డలు కూడా మంచి ఇళ్లకు కోడళ్లుగా వెళ్లాలి. ఇటీవల నిహారిక గురించి కూడా ఇలాగే తంబ్‌నైల్స్ పెట్టారు. నిహారిక పబ్‌కు వెళ్లిన విషయం వాస్తవమే. కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. అవేమీ ఆలోచించకుండా డ్యామేజ్ కలిగే తంబ్స్ పెట్టడం ఎంతవరకూ న్యాయం. మోహన్‌బాబు కుటుంబంపై జరిగిన ట్రోలింగ్ కూడా బాధ కలిగించింది’’ అని అన్నారు.