ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ
1 min readపల్లెఃవెలుగు వెబ్: తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ నేతల ఆగడాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వైసీపీ నేతలు బయటి ప్రదేశాల నుంచి బస్సుల్లో ప్రజల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. . తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఫంక్షన్ హాల్ లోకి వేలాది మంది ప్రజలు బస్సుల్లో వస్తున్నారని, పోలీసులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలా జరగడం దారుణమని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.