మందు బాబులకు గుడ్ న్యూస్ !
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంజాబ్లోని ఆమ్ఆద్మీ సర్కార్ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్ ఆమోదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగాఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త విధానం వల్ల 2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.